1. ఏ రాష్ట్రంలోని పారాదీప్‌లో భారత చమురు సంస్థ (ఐఓసీ) నిర్మించిన చమురు శుద్ధి కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2016 ఫిబ్రవరిలో జాతికి అంకితం చేశారు? (దీన్ని రూ.34555 కోట్లతో నిర్మించారు, దీని వార్షిక సామర్థ్యం 15 మిలియన్ టన్నులు.)
ఎ) పశ్చిమ్ బంగ
b) రాజస్థాన్
సి) మహారాష్ట్ర
డి) ఒడిశా
2. 2016 ఫిబ్రవరిలో ఏ దేశం చేపట్టిన రాకెట్ ప్రయోగం వివాదాస్పదమైంది? (దీని ద్వారా అంతరిక్షంలోకి క్వాంగ్ మ్యాంగ్-4 అనే భూపరిశీలన ఉపగ్రహాన్ని పంపినట్లు ఆ దేశం వెల్లడించింది. అంతర్జాతీయంగా వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఈ ప్రయోగాన్ని నిర్వహించడం గమనార్హం.)
ఎ) ఉత్తర కొరియా
బి) ఇరాక్
సి) దక్షిణ కొరియా
డి) ఇరాన్
3. 2016 ఫిబ్రవరి 9, 10 తేదీల్లో రాష్ట్రాల గవర్నర్ల సదస్సును ఎక్కడ నిర్వహించారు?
ఎ) దిల్లీ
బి) కోల్‌కతా
సి) ముంబయి
డి) చెన్నై
4. ఇటీవల మరణించిన సుశీల్ కొయిరాలా ఏ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు?
ఎ) మాల్దీవులు
బి) భూటాన్
సి) నేపాల్
డి) ఇండోనేషియా
5. ఏ రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల మంది రైతులతో వెయ్యి వ్యవసాయ ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేయాలని ఇటీవల నిర్ణయించింది? (వ్యవసాయ అనుబంధ రంగాలను మరింత లాభసాటిగా మార్చేందుకు దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒకే రకమైన పంట పండించే రైతులందరినీ సంఘటితం చేసి, దళారీ వ్యవస్థ లేకుండా లాభసాటి ధరకు ఉత్పత్తులను విక్రయించుకు నేలా చూడటం ఈ వ్యవస్థ ఉద్దేశం.)
ఎ) కర్ణాటక
బి) ఆంధ్రప్రదేశ్
సి) తమిళనాడు
డి) కేరళ ○
No comments:
Post a Comment