తెలంగాణా రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనస్టిట్యూషన్స్ సొసైటీ- ఇంటర్మీడియెట్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన టిఎస్‌ఆర్జేసి సెట్ 2016కు ప్రకటన విడుదల చేసింది. తెలంగాణా రాష్ట్రంలోని పది జిలాల్లో ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా టిఎస్‌ఆర్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి గాను ప్రవేశం ఉంటుంది.
ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా టిఎస్‌ఆర్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి గాను ప్రవేశం ఉంటుంది.
జనరల్ జూనియర్ కాలేజీల్లో ఎంపిసి, బైపిసి, ఎంఇసి గ్రూపులు ఇంగ్లీషు మీడియంలో అందుబాటులో ఉన్నాయి. బాలుర కోసం నల్గొండ జిల్లా సర్వైల్‌లో, బాలికల కోసం వరంగల్ జిల్లా హసనపర్తిలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి.
మైనారిటీ కాలేజీల్లో అయితే ఎంపిసి, బైపిసి, సిఇసి గ్రూపులు ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో చదివే అవకాశం ఉంది. మైనారిటీ వర్గాల బాలురకు నిజామాబాద్ జిల్లా- నాగారం, హైదరాబాద్- నాగోల్‌లో జూనియర్ కాలేజీలు ఉన్నాయి.
No comments:
Post a Comment