రాష్ట్రంలో 500 డాక్టర్ల పోస్టులు, మరో 1000 నర్సు పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య వెల్లడించారు. ఇప్పటికే 1500 మంది పారా మెడికల్ సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం ఆమె వైద్యాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తృతపరిచేందుకు, రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు 200 మంది గైనాకాలజిస్టులు, 50 మంది చిన్నపిల్లల వైద్యులు, మరో 50 మంది అనస్తీషియా వైద్యులను నియమించబోతున్నట్లు చెప్పారు.
వచ్చే నెల 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 275 ఎన్‌టీఆర్ సంచార వైద్య వాహనాల ద్వారా ప్రజలకు ఆధునిక వైద్య సేవలను అందించే నూతన విధానాన్ని అమలు చేయనున్నట్లు పూనం వివరించారు. 35 ఏళ్లు దాటిన ప్రతీ మహిళకు మాస్టర్ హెల్త్‌చెకప్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు తెలిపారు. 104లో పనిచేసే సిబ్బందిని తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.

Sourse:http://edu.andhrajyothy.com/EduNewsArticle.aspx?SID=222719
No comments:
Post a Comment